కామారెడ్డి, ఫిబ్రవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టుల సముదాయమును ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత గురువారం సందర్శించారు. కామారెడ్డిలో పోక్సో కోర్టు ఏర్పాటు విషయమై భవనాలను పరిశీలించారు. కామారెడ్డి కోర్టులలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మొదటగా జిల్లా ప్రధాన న్యాయమూర్తికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోక్సో కోర్టు ఏర్పాటు విషయమై చర్చించారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అదనపు జడ్జి రమేష్ బాబు, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి, ప్రభుత్వ న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు జూనియర్ వాదులు, జుడిషియల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.