కామారెడ్డి, ఫిబ్రవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామ శివారులోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సహాయ కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు.
రాజీవ్ స్వగృహలోని గృహాలను, ఖాళీ స్థలాలను చూడడానికి ఎంత మంది వస్తున్నారని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.