కామారెడ్డి, ఫిబ్రవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెడ్ క్రాస్ సొసైటీకి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రూపాయలు 20 వేలు చెల్లించి ప్యాట్రన్ సభ్యత్వం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ను గురువారం రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, వైస్ చైర్మన్ అంకన్న గారి నాగరాజ్ గౌడ్, కోశాధికారి దస్తీరామ్, ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సభ్యత్వ నమోదును ముమ్మరంగా కొనసాగించాలని సూచించారు.
రెడ్ క్రాస్ సొసైటీకి అండగా ఉంటానని చెప్పారు. రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు మాస్కులను అందజేశారు. కార్యక్రమంలో కామారెడ్డి డివిజన్ కార్యదర్శి జమీల్ అహ్మద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సంజీవరెడ్డి, కామారెడ్డి మండల చైర్మన్ నితీష్ రెడ్డి, జిల్లా కరస్పాండెంట్ పీవీ నరసింహం, కార్యవర్గ సభ్యులు వెంకటేశం పాల్గొన్నారు.