వేములవాడ, ఫిబ్రవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దక్షిణ కాశీగా పేరుప్రతిష్టలు పొంది భక్తుల ఇలవేల్పు అయిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు అనునిత్యం వేలల్లో భక్తులు వస్తూ ఇక్కడ నుండి మేడారం సమ్మక్క జాతర ఉత్సవాలకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని అనంతరం అక్కడికి వెళ్లడం ఆనవాయితీ.
కావున భక్తులకు కరోనవైరస్ బారిన పడకుండా ఉండేందుకు గురువారం రోజున వేములవాడ వాస్తవ్యులు నగుబోతు రవి రాజన్న దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ బారిన పడకుండా ఉండేందుకు భక్తుల సౌకర్యార్థం ఆలయ ఈఓ ఎల్ రమాదేవికి 20 వేల మాస్క్‌లు, 600 వందల లీటర్ల సానిటైజర్లు మొత్తం 80 వేల రూపాయల విలువగల సామగ్రి అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఈ రాజేష్, ఏఈఓ ప్రతాప నవీన్, పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, హరిహరనాథ్, ఎల్ రాజేందర్, ఎడ్ల శివ ఉన్నారు.