డిచ్‌పల్లి, ఫిబ్రవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాల్యంలోని ఎకనామిక్స్ విభాగాధిపతి టి. సంపత్ ఈ నెల 24, 25 తేదీలలో ముంబయ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సెక్యూరిటీ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబి), నేషనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ సెక్రూరిటీస్ మార్కెట్స్ (నిజ్మ్) సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ఇన్వెస్టింగ్ ఇన్ రికవరి: చాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ఇండియన్ సెక్యూరిటీస్ మార్కెట్స్’’ అనే అంశంపై నిర్వహింపబడే అంతర్జాతీయ సదస్సులో పరిశోధనాత్మక పత్రసమర్పణ చేయబోతున్నారు.
ఈ సందర్భంగా టి. సంపత్ మాట్లాడుతూ సదస్సులో తాను ‘‘వోలాటిలిటీ సిల్లోవర్స్ ఆన్ ఇండియన్ కమోడిటీ మార్కెట్: ఎంపిరికల్ ఎవిడెన్స్ ఫ్రం ది ‘ఎంగార్చ్’ మోడల్’’ అనే అంశంపై పత్రసమర్పణ చేయబోతున్నానన్నారు. అంటే భారతదేశంలోని వస్తు ధరల వ్యవహారంలో కొనసాగుతున్న అస్థిరతపై విశ్లేషణ చేస్తున్నట్లు తెలిపారు. వస్తు ధరల నిర్ణయంలో ఈ పత్రం కీలకంగా మారనుందని అన్నారు.
ఈ పత్రం విశిష్టమైన వ్యాపార, వాణిజ్య, ఆర్థిక విషయ నిపుణల చేత పరిశీలింపబడి సమర్పణకు అనుమతింపబడిరదని అన్నారు. అందుకు గాను పారితోషకంగా 5 వేల రూపాయలను బహుమతిగా తాను స్వీకరించబోతున్నట్లుగా పేర్కొన్నారు. అదేవిధంగా తాను సదస్సులో సమర్పించే పత్రానికి ఉత్తమ బహుమతి కూడా లభించాలనే ఆకాంక్షతో ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు గాను తీవ్రంగా పరిశోధనా పరిశ్రమలో అన్వేషణ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ ప్రత్యేకంగా ప్రశంసిస్తూ సంపత్ పరిశోధన పత్రానికి ప్రతిష్టాత్మకమైన సెబి అండ్ సిజ్మ్ సంస్థల నుంచి పారితోషికం లభించడం చాలా సంతోషదాయకమని, తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రతిష్టను ఇనుమడిరప చేస్తుందని అన్నారు. అధ్యాపకులు, విద్యార్థులు పరిశోధనా రంగంలో కృషి చేయడానికి సహకారం అందిస్తామని అన్నారు. కళాశాల ప్రధానాచార్యులు డా. నాగరాజ్, అనువర్తిత ఆర్థికశాఖ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు తదితరులు సంపత్‌కు అభినందనలు తెలిపారు.