Daily Archives: February 4, 2022

తెరాస ప్రభుత్వం పేదల పక్షం

గాంధారి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమని,దాని కొరకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ కృషి చేస్తున్నారని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.శుక్రవారం గాంధారి మండలంలోని ముదెల్లి గ్రామంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌తో కలిసి డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం కొరకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా స్పీకర్‌ పోచారం మాట్లాడుతూ రాష్టంలోని ప్రతి ఇల్లు లేని …

Read More »

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

గాంధారి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన ఎంపీటీసీ భర్త కుటుంబ సభ్యులకు సాయినేని ట్రస్ట్‌ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు. శుక్రవారం గాంధారి తెరాస నాయకులతో కలిసి సాయినేని ట్రస్ట్‌ అధినేత సత్యం రావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా సత్యం రావు మాట్లాడుతూ మండలంలో ప్రజాదరణ కల్గిన ఎంపీటీసీ భర్త సురేష్‌ మరణించడం బాధాకరం అన్నారు. …

Read More »

సంక్షేమ శాఖల పనుల ప్రగతిపై కలెక్టర్‌ సమీక్ష

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రగతి పనుల విషయమై కలెక్టర్‌ శుక్రవారం సంబంధిత అధికారులతో తన చాంబర్‌ లో సమీక్ష జరిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలో కొనసాగుతున్న గురుకులాలు, రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్వహణ తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. సొంత భవనాలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ అద్దె భవనాలలో కొనసాగుతున్నయన్న …

Read More »

మార్చి నెలాఖరు నాటికి అన్ని నిర్మాణ పనులను పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి వివిధ శాఖలు, ఆయా పథకాల ద్వారా మంజూరీలు తెలుపబడిన ప్రజోపయోగ పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన కలేక్టరేట్‌ నుండి ఆయా శాఖల జిల్లా అధికారులు, ఆర్దీవోలు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఇంజనీరింగ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్మాణ …

Read More »

పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి..

కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదో తరగతిలో వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ప్రధానోపాధ్యాయుల సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. చదువులో …

Read More »

భారతరత్న జూనియర్‌ కళాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి…

బాన్సువాడ, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా బాన్సువాడ పట్టణంలో ఉన్న భారతరత్న జూనియర్‌ కళాశాల యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని (ఏ.ఐ.ఎస్‌.బీ) ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ బ్లాక్‌ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బైరాపూర్‌ రవీందర్‌ గౌడ్‌ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో కోవిడ్‌ నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదని మాస్క్‌లు, భౌతిక దూరం, శనిటైజర్‌ ఏమాత్రం పాటించడం లేదని, …

Read More »

టీయూను పరిశోధనా ప్రాంగణంగా తీర్చిదిద్దుతా…

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో గల సమావేశ మందిరంలో శుక్రవారం రెగ్యూలర్‌, కాంట్రాక్ట్‌ అధ్యాపకులందరితో వీసీ ఆచార్య రవీందర్‌ గుప్తా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఈ నెల 1 వ తేదీ నుంచి ప్రత్యక్ష (భౌతికంగా) క్లాసులు ప్రారంభమైనందు వల్ల అధ్యాపకులందరితో పాఠ్యప్రణాళికలు, టైం టేబుల్‌, వర్క్‌ లోడ్‌ వంటి …

Read More »

ఎంపీడీవో, ఏపీవో, కార్యదర్శులకు మెమో జారీ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం మొక్కల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం పట్ల కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సీరియస్‌ అయ్యారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన అధికారులు, సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించారు. మల్కాపూర్‌, అబ్బాపూర్‌ (ఎం) గ్రామ శివార్లలో హరితహారం మొక్కలు అస్తవ్యస్తంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఎంపీడీఓ, ఉపాధి హామీ ఎపీవో, పంచాయతీ కార్యదర్శులు, ఇజిఎస్‌ సిబ్బంది …

Read More »

ఆర్‌టిఐని అందరు వినియోగించుకోవాలి…

నసురుల్లాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్‌టిఐ అవగాహన రక్షణ కమిటీ కామారెడ్డి జిల్లా 2022 సంవత్సరం క్యాలెండర్‌ని నసురుల్లాబాదు తహసీల్దార్‌ బాబాయ్య, నసురుల్లాబాదు ఎస్‌ఐ నారాయణ సింగ్‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు. జిల్లా ఉపాధ్యక్షులు మొగులయ్య మాట్లాడుతూ ఆర్‌టిఐని అందరూ వినియోగించుకోవాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి సమాచారం కావాలన్నా ఆర్‌టిఐ ద్వారా పోదవచ్చని పేర్కొన్నారు. ఆర్‌టిఐకి ప్రభుత్వ ఉద్యోగులందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బాన్సువాడ …

Read More »

రాజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే రఘునందన్‌ రావు

వేములవాడ, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దక్షిణ కాశీగా పేరుప్రతిష్టలు పొందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు శుక్రవారం రోజున దుబ్బాక బి. జె.పి. ఎమ్మెల్యే రఘునందన్‌ రావు కుటుంబ సమేతంగా విచ్చేసి కోడెమొక్కు చెల్లించిన అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈఓ ఎల్‌.రమాదేవి స్వామివారి ప్రసాదం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »