గాంధారి, ఫిబ్రవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన ఎంపీటీసీ భర్త కుటుంబ సభ్యులకు సాయినేని ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు. శుక్రవారం గాంధారి తెరాస నాయకులతో కలిసి సాయినేని ట్రస్ట్ అధినేత సత్యం రావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్బంగా సత్యం రావు మాట్లాడుతూ మండలంలో ప్రజాదరణ కల్గిన ఎంపీటీసీ భర్త సురేష్ మరణించడం బాధాకరం అన్నారు. ఇలాంటి కష్ట కాలంలో దైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్చారు. స్థానిక ఎమ్మెల్యే సురేందర్, ఎమ్మెల్సీ కవితతో మాట్లాడి ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా సహాయ సహకారం అందేలా చూస్తామని తెరాస నాయకులు భరోసా ఇచ్చారు.
సాయినేని ట్రస్ట్ ద్వారా మృతుని భార్య కు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాధా బలరాం నాయక్, సొసైటీ చైర్మన్ సాయి కుమార్, ముకుంద్ రావు, శివాజీ రావు, సర్పంచ్ సంజీవ్ యాదవ్, బెజుగం సంతోష్ తదితరులు ఉన్నారు.