కామారెడ్డి, ఫిబ్రవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా కాట్రియాల్‌కు చెందిన లాస్య (28) కు ఏ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం మెదక్ జిల్లాలో లభించకపోవడంతో వారి బంధువులు విద్యార్థి అండ్ యువజన రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల నిర్వాహకుడు బాలును సంప్రదించారు.
వెంటనే స్పందించి పట్టణానికి చెందిన మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు వేణుగోపాల శర్మ సహకారంతో సకాలంలో ఏ నెగెటివ్ రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందించడం జరుగుతుందని ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం అయినట్లయితే 9492874006 నెంబర్‌కి సంప్రదించాలన్నారు.
నేటి సమాజంలో స్వార్థం విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో కూడా నిస్వార్ధంగా రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం మానవత్వానికి నిదర్శనం అని అన్నారు.త్వరలోనే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలోనీ విద్యార్థులకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన ఆవశ్యకత, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రక్త దానానికి ముందుకు వచ్చిన రక్తదాతకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వీ.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంకు టెక్నీషియన్లు చందన్, ఏసుగౌడ్, రాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.