వేములవాడ, ఫిబ్రవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దక్షిణ కాశీగా పేరుప్రతిష్టలు పొందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి మహా శివరాత్రి జాతర సందర్భంగా రాజన్న ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లను ఆర్‌డిఓలతో కలసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
పారిశుద్ధ్య సమస్య లేకుండా, తాగునీటి సమస్య లేకుండా చూడాలని సూచించారు. శాశ్వత మరుగుదొడ్లతో పాటుగా తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయానికి వచ్చే భక్తులకు అదనపు సౌకర్యాల కల్పన కొరకు ఆర్డీఓ మునిసిపల్ అధికారులతో సమన్వయపర్చుకొని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వీరి వెంట మునిసిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్, తహసీల్దార్ మునిందర్, ఆలయ ఈఈ రాజేష్, ఏఈఓలు హరికిషన్, శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీరాములు, నరసయ్య పిఆర్‌ఓ చంద్రశేఖర్ ఉన్నారు.