ఆర్మూర్, ఫిబ్రవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సొంత స్థలాలు ఉన్న ఇల్లు లేనివారికి ఇంటి నిర్మాణానికి రూ. 10 లక్షలు ఇవ్వాలని, అట్లాగే కొత్త ఆసరా పెన్షన్‌లను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆర్‌డివోకు వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా అధ్యక్షులు కిషన్, ప్రధాన కార్యదర్శి సుమన్, నాయకులు బట్టు రవి, ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి శేఖర్, ఉపాధ్యక్షులు భోజెంధర్, నాయకులు కిషోర్, రాజ్ మహమ్మద్, నరేష్, అనిల్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.