కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాలుగు రోజుల్లో జిల్లాలోని వివిధ గ్రామాలను స్వచ్ఛ సర్వేక్షన్ బృందాలు పర్యటిస్తాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరై అధికారులతో మాట్లాడారు. గ్రామాల్లోని పాఠశాలలు, పంచాయతీ భవనాలు, ఆరోగ్య కేంద్రం భవనాలు, అంగన్‌వాడి భవనాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలని సూచించారు. మంగళవారం ఉదయం …
Read More »Daily Archives: February 7, 2022
స్టేడియంను పరిశీలించిన కలెక్టర్
కామరెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. గదిలో ఉన్న క్రీడా పరికరాలను పరిశీలించారు. వీటిని క్రీడాకారులు వినియోగించుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా క్రీడలు, యువజన సర్వీసులు అధికారి దామోదర్ రెడ్డి, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, అధికారులు ఉన్నారు.
Read More »సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దోహదపడుతుంది
కామరెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సోమవారం ఆజాదీకా అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా యజ్ఞ సహిత యోగా సూర్య నమస్కారాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆసనాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని సూచించారు. యోగా …
Read More »