డిచ్‌పల్లి, ఫిబ్రవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణా విశ్వవిద్యాలయంలోని వృక్షశాస్త్ర విభాగంలో శిరీష సోమీనేనీకి పిహెచ్. డి. డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. అందుకు గాను ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని సమావేశ మందిరంలో సోమవారం ఉదయం ఆమెకు ఓపెన్ వైవా వోస్ (మౌఖిక పరీక్ష) నిర్వహించారు.
వృక్షశాస్త్ర విభాగాధిపతి ఆచార్య డా. అహ్మద్ అబ్దుల్ హలీంఖాన్ పర్యవేక్షణలో ‘‘స్టడీస్ ఆన్ ఎపెక్ట్ ఆఫ్ ప్లాంట్ వేజిటేటివ్ గ్రోత్ రేగులేటర్స్ ఆన్ మెడీసినల్ వాల్యు ఆఫ్ ఆఖలీఫ ఇండికా. ఎల్.’’ అనే అంశంపై పరిశోధక సిద్ధాంత గంధాన్ని రూపొందించి తెలంగాణ విశ్వవిద్యాలయానికి సమర్పించారు.
వైవా వోస్‌కు ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్‌గా హైదరాబాద్ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని వృక్షశాస్త్ర విభాగంలోని ప్రొఫెసర్ డా. నిర్మల బాబూరావు విచ్చేసి పరిశోధకురాలిని పలు ప్రశ్నలు అడిగి సిద్ధాంత గ్రంథ ఫలితాంశాలను తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో సైన్స్ ఫ్యాకల్టి డీన్ ఆచార్య ఎం. అరుణ, వృక్షశాస్త్ర విభాగాధిపతి ఆచార్య బి. విద్యావర్థిని, బివోఎస్. డా. అహ్మద్ అబ్దుల్ హలీంఖాన్, డా. దేవరాజు శ్రీనివాస్, డా. వి. జలంధర్ తదితర పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. శిరీష పిహెచ్. డి. సాధించడం పట్ల తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య శివశంకర్ అభినందనలు తెలిపారు.