గాంధారి, ఫిబ్రవరి 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గంజాయి రహిత సమాజాన్ని నిర్మిద్దామని పలువురు ప్రతిజ్ఞ చేశారు. గాంధారి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో మంగళవారం అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు గంజాయి నిర్ములన ప్రతిజ్ఞ చేశారు. గంజాయి అనే మహమ్మారిని నిర్ములించి రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతామని ప్రతిజ్ఞ చేశారు.
గంజాయి అనే మత్తు పదార్థానికి అలవాటు పడి మానసిక ఒత్తిడికిలోనై అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వక్తలు అన్నారు. నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో గంజాయి లేకుండా చేయడానికి గాంధారి మండల ప్రజలు ముందుంటారని సర్పంచ్‌ల సంఘం మండల కన్వీనర్ సంజీవ్ యాదవ్ అన్నారు.
ఆరోగ్య తెలంగాణ సాధనలో ముందుంటామని అన్నారు. ప్రజల సహకారంతో మండలంలో గంజాయి రహిత సమాజం నిర్మిద్దామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోవర్ధన్, ఎంపీడీఓ సతీష్, సొసైటీ చైర్మన్ సాయికుమార్, ఎస్‌ఐ నర్సింహా రావు తదితరులు పాల్గొన్నారు.