డిచ్‌పల్లి, ఫిబ్రవరి 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రధాన క్యాంపస్ ప్రిన్సిపల్‌గా కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు ఆచార్య సిహెచ్. ఆరతి నియామకం పొందారు. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ తన చాంబర్‌లో బధవాతం ఉదయం ప్రిన్సిపల్ నియామక పత్రాన్ని అందించారు. ఉపకులపతి ఆదేశానుసారం రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా ఆరతికి వీసీ, రిజిస్ట్రార్‌లు శుభాకాంక్షలు తెలిపారు.
ఆచార్య సిహెచ్. ఆరతి ఇది వరకు ఇదే కళాశాలకు ప్రధానాచార్యులుగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్‌ఎస్‌ఎస్ కో – ఆర్డినేటర్‌గా, ఉమెన్ సెల్ డైరెక్టర్‌గా, డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ కో- ఆర్డినేటర్‌గా, సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్‌గా తదితర పాలనా పరమైన పదవులను నిర్వర్తించారు. కంప్యూటర్ సైన్స్ కళాశాలకు విభాగాధిపతిగా, బిఓఎస్ చైర్ పర్సన్‌గా కూడా అకడమిక్ బాధ్యలను కూడా నిర్వహించారు.
ఆచార్య సిహెచ్. ఆరతికి డా. నాగరాజ్ ప్రధానాచార్యుల విధుల బదలాయింపును అందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. డా. సిహెచ్. ఆరతికి ఈసీ మెంబర్ డా. కె. రవీందర్ రెడ్డి, డా. వాసం చంద్రశేఖర్, డా. ప్రవీణా బాయి, డా. పాత నాగరాజు, డా. చంద్రశేఖర్, డా. త్రివేణి, డా. రాంబాబు, డా. సంపత్ కుమార్, డా. అథిక్, డా. గుల్ – ఇ – రాణా, డా. ఖురేషి, డా. డా. భ్రమరాంబిక, డా. పున్నయ్య, డా. సంపత్, డా. అబ్దుల్ ఖవి, నీలిమా, ప్రసన్న శీల తదితర అధ్యాపకులు అభినందనలు తెలిపారు. తనపై ఎంతో బాధ్యతతో ప్రిన్సిపల్ పదవిని అందించిన వీసీ, రిజిస్ట్రార్‌లకు ఆరతి ధన్యవాదాలు తెలిపారు.
ఫ్యాకల్టీ ఆఫ్ బిజినెస్ మేనేజ్ మెంట్ డీన్‌గా ఆచార్య కైసర్ మహ్మద్ నియామకం
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ బిజినెస్ మేనేజ్ మెంట్ డీన్‌గా ఆచార్య కైసర్ మహ్మద్ నియమితులయారు. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ బుధవారం ఉదయం డీన్ నియామక పత్రాన్ని అందించారు.
ప్రధాన క్యాంపస్ వైస్ – ప్రిన్సిపల్‌గా డా. సత్యనారాయణ నియామకం
తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రధాన క్యాంపస్ వైస్ – ప్రిన్సిపల్‌గా ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం. సత్యనారాయణకు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ బుధవారం ఉదయం నియామకం చేశారు.
పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్, మాథమెటిక్స్ బిఓఎస్‌గా డా. కె. సంపత్ కుమార్‌కు పదవీ బాధ్యతల పొడగింపు
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అప్లైడ్ స్టాటిస్టిక్స్ విభాగాధిపతి డా. సంపత్ కుమార్‌కు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్‌గా పదవిని పొడిగిస్తూ ఉపకులపతి ఆచార్య. డి. రవీందర్ బధవారం ఉదయం నియామక ఉత్తర్వులను అందించారు. అదే విధంగా మ్యాథమెటిక్స్ విభాగానికి బిఓఎస్ చైర్ పర్సన్‌గా పదవీ బాధ్యతలను పొడగింపు చేశారు.