కామారెడ్డి, ఫిబ్రవరి 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రమలోనీ ప్రభుత్వ వైద్యశాలలో స్వాతి (23) గర్భిణీకి కావలసిన ఏబి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో బ్లడ్ బ్యాంకులో రక్తం లేకపోవడంతో వారి బంధువులు జూనియర్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు.
దీంతో వెంటనే స్పందించి మట్టే శ్రీకాంత్ రెడ్డి సహకారంతో సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. రక్త దానానికి ముందుకు వచ్చిన రక్తదాత శ్రీకాంత్ రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో వీ.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్ పాల్గొన్నారు.