భీమ్‌గల్, ఫిబ్రవరి 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పట్టణ కేంద్రానికి చెందిన న్యూ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ రిజిష్టర్ నెం. 117 వారు భీంగల్ పట్టణానికి, ప్రజలకు గత ఏడెనిమిది సంవత్సరలుగా మెరుగైన సామాజిక సేవలు అందిస్తున్నందుకు గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రు యువ కేంద్రం వారు యూత్ సేవలని గుర్తించారు.
రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో జరిగిన కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఎక్సైజ్ సూపరిడెంట్ నవీన్ చంద్ర, యువజన సంఘాల కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా అధికారి శైలి బెల్లాల్, జాతీయ క్షయ వ్యాధి నిర్ములన కో ఆర్డినేటర్ నరేష్, జిల్లా అధికారి శ్యామల పాల్గొన్నారు.
యూత్ అధ్యక్షుడు రావుట్ల అరవింద్‌ని అభినందించి న్యూ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులకు 5 రకాల ఆట వస్తువులు (వాలీబాల్, క్యారం బోర్డ్, చెస్, ఫుట్ బాల్, ప్లెయింగ్ రింగ్స్) వారికి అందజేసి ప్రోత్సహించారు. అలాగే ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర మాట్లాడుతూ నేటి యువత గంజాయి వల్ల వచ్చే ప్రమాదాలు, వాటిని అరికట్టే మెలకువలు, టిబి కో ఆర్డినేటర్ క్షయ వ్యాధి పట్ల అవగాహన సదస్సు, వాటిని నివారించే పద్ధతుల గురించి వివరించారు.
కార్యక్రమంలో యూత్ సభ్యులు తొగిటి నవీన్, బండారి రవి తేజ, జోగన్పల్లి సతీష్ గౌడ్, అరుణ్, జిల్లా యువజన సంఘాల అధ్యక్షులు, యూత్ సభ్యులు, రెడ్ క్రాస్ సొసైటీ స్వచ్చంద సంస్థ అధికారులు పాల్గొన్నారు.