విద్యార్థులకు డిజిటల్‌ విద్యనందించాలి….

కామారెడ్డి, ఫిబ్రవరి 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం దేవునిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని సైన్స్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌లను గురువారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. విద్యార్థులకు డిజిటల్‌ విద్యను అందించాలని సూచించారు.

సైన్స్‌ ల్యాబ్‌ పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కొద్దిసేపు కలెక్టర్‌ వాలీబాల్‌ ఆడారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాజు, మండల విద్యాధికారి ఎల్లయ్య, ప్రధానోపాధ్యాయుడు సాయిలు, వ్యాయామ ఉపాధ్యాయుడు సంజీవ్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »