కామారెడ్డి అదనపు కలెక్టర్‌గా చంద్రమోహన్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి అదనపు కలెక్టర్‌గా చంద్రమోహన్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ను కలిసి మొక్కను అందజేశారు. రాష్ట్ర అదనపు కలెక్టర్ల అసోసియేషన్‌ డైరీని ఆవిష్కరించారు.

ఇంతవరకు రాష్ట్ర బ్రాహ్మణ సమైక్య పరిషత్‌ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసిన చంద్రమోహన్‌ కామారెడ్డి అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ మాట్లాడారు. జిల్లా అధికారుల సహకారంతో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏవో రవీందర్‌, ఎల్లారెడ్డి, బాన్సువాడ ఆర్డివోలు శీను, రాజాగౌడ్‌, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »