కామారెడ్డి, ఫిబ్రవరి 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రస్తుత విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 9123 పాఠశాలలను మన ఊరు మన బడి మొదటి విడతలో గుర్తించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం మన ఊరు -మన బడి కార్యక్రమం అమలులో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. మొదటి విడతలో అత్యధిక విద్యార్థుల సంఖ్య గల పాఠశాలల సీనియారిటీని రాష్ట్ర కార్యాలయం నుంచి త్వరలో పంపబడుతుందని పేర్కొన్నారు.
ఎంపికైన పాఠశాలలు గుర్తించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్ల ఆమోదం పొందిన తర్వాత మొదటి విడతలో పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని మంత్రులు ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) చంద్రమోహన్, డీఈవో రాజు, జడ్పీ సీఈఓ సాయాగౌడ్, అధికారులు పాల్గొన్నారు.