నిజామాబాద్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పుస్తకాలు అందించే జ్ఞానం జీవితాన్ని గొప్పగా నడిపిస్తాయని, పుస్తక పఠనం ప్రపంచంలోనే అత్యంత మంచి అభిరుచి అని ప్రముఖ సమాజ సేవకుడు మంచాల జ్ఞానేందర్ గుప్తా అన్నారు. ఫిబ్రవరి 14 ప్రపంచ పుస్తక వితరణ దినోత్సవం సందర్భంగా హరిద రచయితల సంఘం ఆధ్వర్యంలో నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. …
Read More »Daily Archives: February 14, 2022
మంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
వర్ని, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జిల్లా పర్యటనను పురస్కరించుకుని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్. నాగరాజు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పరిధిలోని చద్మల్, పైడిమల్, నంకోల్ చెరువుల సామర్థ్యం పెంపు, కాలువల …
Read More »కోవిద్ కాలం ద్వారా జండర్ వివక్ష ఇంకా కొనసాగుతుందని నిరూపితమైంది
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మహిళా విభాగం డైరెక్టర్ డా. కె. అపర్ణ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ‘‘జండర్ ఈక్వాలిటీ – ఇష్యూస్ అండ్ చాలెంజెస్’’ (జండర్ సమానత్వం – సమస్యలు, సవాళ్లు) అనే అంశంపై వెబినార్ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన వక్తగా కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఎకనామిక్స్ విభాగం విశ్రాంతాచార్యులు, సోషల్ సైన్స్ డీన్ ఆచార్య తోటా జ్యోతీ రాణి విచ్చేసి …
Read More »స్పెషల్ బి.ఇడి ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు మార్చి 11 చివరితేదీ
నిజామాబాద్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నిర్వహించే స్పెషల్ బి.ఇడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు చివరితేదీ మార్చి 11 అని అధ్యయన కేంద్ర రీజనల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. మానసికంగా చెవులకు, కళ్ళు సంబంధిత అంగవైకల్యంతో ఉన్న పిల్లలకు బోధించడానికి స్పెషల్ బి.ఇడి ఉపయోగపడుతుందన్నారు. బి.ఏ., బి.కాం., బి.ఎస్‌సి., బి.సి.ఏ., బి.బి.ఎం., బి.ఇ., …
Read More »ఘోర రోడ్డు ప్రమాదం – దంపతుల మృతి
కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దోమకొండ పెట్రోల్ పంపు వద్ద డీసీఎం వ్యాన్, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు రమేశ్ (46), సరస్వతి (38)గా గుర్తించారు. వీరి స్వస్థలం మెదక్ జిల్లా నిజాంపేట మండలం నష్కల్. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి …
Read More »నీట్‌లో భీమ్‌గల్ విద్యార్థిని ప్రతిభ
భీమ్‌గల్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పట్టణ కేంద్రంలోని వ్యాపారవేత్త అయిన అరే రఘు, సునీతల కూతురు అరే తేజస్విని 2021 నీట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనపర్చి తన సత్తా చాటుకుంది. అందుకుగాను అరే తేజస్వినికి నేషనల్ ఎంట్రన్స్ కం ఎలిజిబిల్ టెస్ట్‌లో అల్ ఓవర్ ఇండియాలో 5363, ఓబిసి రిజర్వేషన్‌లో 1868, తెలంగాణలో 161 ర్యాంక్ సాధించినందుకు సోమవారం వేల్పూర్ రోడ్డులోని …
Read More »అర్హులకు రెండు పడక గదుల ఇళ్ళు ఇవ్వాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవనగర్ కాలనిలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎదుట అర్హులకు డబల్ బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 16 కోట్ల రూపాయలతో నిర్మించిన డబల్ బెడ్‌రూమ్ …
Read More »ఈ నెల 18 వరకు ఆర్థిక అక్షరాస్యత వారం
నిజామాబాద్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గో డిజిటల్ గో సెక్యూర్ అనే అంశంపై భారతీయ రిజర్వ్ బ్యాంకు ఈ నెల మూడవ వారాన్ని ఆర్థిక అక్షరాస్యత వారంగా నిర్ణయించిందని లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ యు ఎన్. శ్రీనివాసరావు తెలిపారు. దీనిని పురస్కరించుకుని రూపొందించిన గోడ ప్రతులను సోమవారం స్థానిక ప్రగతి భవన్‌లో జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎల్‌డీఎం శ్రీనివాసరావు …
Read More »ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యత
నిజామాబాద్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి కలెక్టర్ నారాయణరెడ్డి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 76 ఫిర్యాదులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత …
Read More »మౌలిక వసతుల కోసం ప్రతిపాదనలు తయారుచేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మనబడి కార్యక్రమంలో భాగంగా మండలాల వారీగా 100 మంది విద్యార్థులకు పైగా ఉన్న పాఠశాలలను గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడారు. పాఠశాలలో అదనపు గదులు, మౌలిక వసతుల కోసం అధికారులు …
Read More »