కామారెడ్డి, ఫిబ్రవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. శాఖల వారీగా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, డిఆర్‌డిఓ వెంకట మాధవరావు, జెడ్పి సీఈవో సాయా గౌడ్, కలెక్టరేట్ ఏవో రవీందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.