కామారెడ్డి, ఫిబ్రవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవనగర్ కాలనిలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎదుట అర్హులకు డబల్ బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రమణ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 16 కోట్ల రూపాయలతో నిర్మించిన డబల్ బెడ్‌రూమ్ ఇళ్లను పంపిణీ చేయక అవి వ్యసనపరులకు అడ్డాగా మారాయని అన్నారు. నిర్మించిన ఇళ్లలో మరమ్మతుల కొరకు ఆరు నెలల క్రితం దాదాపు కోటి రూపాయలు మున్సిపల్ నుండి కేటాయిస్తే బీజేపీ కౌన్సిలర్లు పేదలకు ఉపయోగ పడుతుందనే ఉద్దేశంతో మద్దతు తెలిపారన్నారు. కానీ అక్కడ మరమ్మత్తు చేసిన దాఖలాలు కనపడటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
దాదాపు 324 ఇండ్లు వృధాగా ఉన్నాయని వాటిని వచ్చే మార్చి 31 లోగా ఇవ్వకపోతే ఏప్రిల్ 1న బీజేపీ కార్యకర్తలే నియోజకవర్గంలో నిర్మించిన అన్ని డబల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు ఇస్తామని హెచ్చరించారు. ధర్నా అనంతరం డబల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు.