ఈ నెల 18 వరకు ఆర్థిక అక్షరాస్యత వారం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గో డిజిటల్‌ గో సెక్యూర్‌ అనే అంశంపై భారతీయ రిజర్వ్‌ బ్యాంకు ఈ నెల మూడవ వారాన్ని ఆర్థిక అక్షరాస్యత వారంగా నిర్ణయించిందని లీడ్‌ బ్యాంక్‌ జిల్లా మేనేజర్‌ యు ఎన్‌. శ్రీనివాసరావు తెలిపారు. దీనిని పురస్కరించుకుని రూపొందించిన గోడ ప్రతులను సోమవారం స్థానిక ప్రగతి భవన్‌లో జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎల్‌డీఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ, సురక్షితమైన డిజిటల్‌ లావాదేవీలను నిర్ధారించే ఉద్దేశ్యంతో ఆర్‌బిఐ ఈ సంవత్సరాన్ని ఫిబ్రవరి 14 నుండి 18వ తేదీ వరకు ఆర్థిక అక్షరాస్యత వారంగా నిర్వహించాలని నిర్ణయించిందన్నారు.

ప్రధానంగా డిజిటల్‌ లావాదేవీల సౌలభ్యం, వినియోగదారులకు రక్షణ కల్పిస్తూ డిజిటల్‌ లావాదేవీల పట్ల సురక్షితమైన అనుభూతి కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం అని వివరించారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో నాబార్డ్‌ డీడీఎం నగేష్‌, డీసీసీబీ సీఈవో లింభాద్రి, యూనియన్‌ బ్యాంకు డీజీఎం నరేంద్ర కుమార్‌, సుధాకర్‌, ప్రవీణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »