నిజామాబాద్, ఫిబ్రవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు.
సోమవారం స్థానిక ప్రగతిభవన్లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి కలెక్టర్ నారాయణరెడ్డి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 76 ఫిర్యాదులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు పంపించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు పెండిరగులో ఉంచకుండా తక్షణమే పరిష్కారం చేసే దిశగా చొరవ చూపాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి వినతులపై తీసుకున్న చర్యల గురించి ఫిర్యాదుదారులకు తప్పనిసరిగా సమాచారం తెలియజేయాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.