నిజామాబాద్, ఫిబ్రవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమ్మక్క సారలమ్మ జాతర ప్రసాదంను మీ సేవ ద్వారా అందించేలా ఏర్పాట్లు చేసిందని ఈ-సేవ జిల్లా మేనేజర్ కార్తీక్ తెలిపారు. భక్త్తులు తమ సమీపంలోని మీ సేవా కేంద్రంలో 225 రూపాయలు చెల్లిస్తే, కొరియర్ ద్వారా నేరుగా ఇంటికే సమ్మక్క సారలమ్మ జాతర ప్రసాదంను పంపించడం జరుగుతుందన్నారు.
భక్తులు చెల్లించే 225 రూపాయలలో ప్రసాదం ధర 190 రూపాయలు కాగా, సేవా రుసుము కింద 35 రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుందని అన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.