భీమ్‌గల్, ఫిబ్రవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పట్టణ కేంద్రంలోని వ్యాపారవేత్త అయిన అరే రఘు, సునీతల కూతురు అరే తేజస్విని 2021 నీట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనపర్చి తన సత్తా చాటుకుంది. అందుకుగాను అరే తేజస్వినికి నేషనల్ ఎంట్రన్స్ కం ఎలిజిబిల్ టెస్ట్‌లో అల్ ఓవర్ ఇండియాలో 5363, ఓబిసి రిజర్వేషన్‌లో 1868, తెలంగాణలో 161 ర్యాంక్ సాధించినందుకు సోమవారం వేల్పూర్ రోడ్డులోని కృషి పబ్లిక్ హై స్కూల్‌లో న్యూ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు రావుట్ల అరవింద్ ఆధ్వర్యంలో అరే తేజశ్వినిని ఘనంగా సన్మానించారు.
పులమాల, జ్ఞాపిక, మెడల్, శాలువతో సన్మానించారు. అనంతరం అరే తేజస్విని మాట్లాడుతూ 9వ, 10వ తరగతిలొనే ఒక లక్ష్యం ఎంచుకుని దానికి అనుగుణంగా మన నడవడిక ఎంచుకొని లక్ష్యాన్ని సాధించుకోవాలని సూచించారు. భవిష్యత్‌లో ప్రతి ఒక్కరు మంచి స్థాయిలో స్థిరపడి భీంగల్ పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని యూత్ సభ్యులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో 8వ వార్డ్ కౌన్సిలర్ సతీష్ గౌడ్, కృషి పబ్లిక్ హై స్కూల్ ప్రిన్సిపల్ సుస్మిత రెడ్డి, అధ్యాపకులు మంజుల, సునీల్, టిఆర్‌ఎస్‌వి టౌన్ ప్రెసిడెంట్ లడ్డు నేత, టిఆర్‌ఎస్‌వి రూరల్ ప్రెసిడెంట్ సంతోష్, న్యూ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు హరీష్, నగేష్, బాలు, అజాయ్, కృషి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.