మోర్తాడ్, ఫిబ్రవరి 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినాన్ని పురస్కరించుకొని మోర్తాడ్ మండల కేంద్రంలో మంగళవారం టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, మోర్తాడ్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు శివలింగు శ్రీనివాస్, మోర్తాడ్ జెడ్పిటిసి బద్దం రవి, వైస్ ఎంపీపీ తొగటి శ్రీనివాస్, మండలంలోని వివిధ గ్రామాల ఎంపీటీసీలు, రైతు నాయకులు, వివిధ గ్రామాల కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.