కామారెడ్డి, ఫిబ్రవరి 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్కనూరు మండలం జంగంపల్లిలోని జ్యోతిబా పూలే బాలికల పాఠశాల (వసతిగ ృహాం) ను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. వసతి గృహ భవనం శిథిలావస్థలో ఉందని మరమ్మతులు చేపట్టాలని ప్రిన్సిపాల్ సత్యనాథ్ రెడ్డి తెలిపారు.
మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. అదనపు గదుల కోసం ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జంగంపల్లి లోని పల్లె ప్రకృతి వనంను పరిశీలించారు. మొక్కలు ఏపుగా పెరిగినందున సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో అనంతరావు, అధికారులు ఉన్నారు.