కామారెడ్డి, ఫిబ్రవరి 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాఠశాల విద్యార్థులకు ఆర్‌బిఎస్‌కె వైద్యులు వైద్య పరీక్షలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలో వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని పాఠశాలలో వైద్య పరీక్షలు చేయాలని సూచించారు.
ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు శిథిలావస్థలో ఉంటే మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు. రక్తహీనత ఉన్న మహిళలను గుర్తించి మందులు పంపిణీ చేయాలని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్, గర్భిణీల నమోదు, క్షయ వ్యాధిపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి చంద్రశేఖర్, డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌వో శోభారాణి, అధికారులు పాల్గొన్నారు.