నిజామాబాద్, ఫిబ్రవరి 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ప్రతీ యేటా నిర్వహించే జాతీయ స్థాయి యూత్ పార్లమెంట్ (ఉపన్యాస పోటీ) కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ కార్యక్రమం ఈ నెల 19వ తేదీన ఆన్ లైన్ ద్వారా నిర్వహించనున్నట్టు జిలా యువజన అధికారిణి, శైలి బెల్లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలో పాల్గొనే వారికి పలు సూచనలు చేశారు.
అర్హత : వయసు 18 సంవత్సరాల నుండి 29 సంవత్సరాల వారు మాత్రమే పాల్గొనాలి
అంశాలు :
- ఇన్ క్రిడిబుల్ ఇండియా
- స్వఛ్ఛ భారత్ – స్వస్థ భారత్
3.బేటీ బచావ్ బేటీ పడావ్ - డిజిటల్ ఇండియా
- ఆయుష్మాన్ భారత్
- స్కిల్ ఇండియా
సమయం : 4 నిమిషాలు మించకూడదు
రిజిస్ట్రేషన్ : ఆన్లైన్ లింక్ ద్వారా కానీ లేదా నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో కానీ సంప్రదించవచ్చు. ముందుగా నమోదు చేసుకున్నవారికి మాత్రమే అనుమతి ఉంటుంది కాబట్టి గమనించగలరు.
జిల్లా స్థాయిలో గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన వారు జాతీయ స్థాయికి పంపించబడతారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఆఫీస్ సమయాల్లో సంప్రదించాలన్నారు. వాట్సాప్ నెం. 7989220061