ఆర్మూర్, ఫిబ్రవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరెంట్ బిల్లులు తగ్గించాలని బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని జిరాయితీ నగర్ ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం సిపిఎం ఆర్మూర్ ఏరియా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ పేద ప్రజలు ఒక బలుబు, ఒక ఫ్యాను, ఒక టీవీ వాడుకుంటున్న నిరుపేదలకు వేల రూపాయల కరెంట్ బిల్లు రావడం సిగ్గుచేటని అన్నారు.
పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలు బకాయి ఉన్న వారిని ఏమీ అనే పరిస్థితి ఉండదని నిరుపేదలు కరెంట్ బిల్లు ఒక నెల కట్టకపోతే కరెంటు కట్ చేసే పరిస్థితి వస్తుందని పెట్టుబడిదారుల దగ్గరనుండి వారికి రావలసిన బకాయిలు వసూలు చేస్తే ప్రజలపై భారాలు వేసే పరిస్థితి ఉండదని వాటిని వసూలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నెలలో కనీసం 100 యూనిట్లు కాల్చుకున్న నిరుపేదలకు మినిమం వందల యాభై రూపాయలు బిల్లు వచ్చేది ఈ నెలలో ఏకంగా 5000, 6000 రావడం చాలా దుర్మార్గం అన్నారు. ఇట్టి విషయం ఎలక్ట్రిసిటీ అధికారులను అడగగా మెయింటెనెన్స్ ఛార్జ్ చేస్తామని చెబుతున్నారని ఇది ఒకటే సారి వస్తుందని తెలిపారు. మెయింటెనెన్స్ చాట్ చేస్తా అని చార్జీలు ప్రభుత్వమే భరించాలని డెవలప్‌మెంట్ అంటే పై భారం వేయడమేనా అని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పెంచిన అదనపు చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి కూతడి ఎల్లయ్య, సభ్యులు సిద్ధల నాగరాజు, సాయిలు, గంగాధర్, కోనింటి దేవన్న, సాయన్న తదితరులు పాల్గొన్నారు.