కామారెడ్డి, ఫిబ్రవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్‌షిప్ ప్లాట్ల వేలం కోసం రామారెడ్డి రోడ్డు లోని గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు అవగాహన సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ధరణి టౌన్‌షిప్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ధరణి టౌన్ షిప్‌లో చదరపు గజానికి పది వేల రూపాయల నుంచి వేలం నిర్వహిస్తామని చెప్పారు. ధరణి టౌన్‌షిప్‌లో ప్లాట్ల వేలం కోసం వచ్చే నెల 14 నుంచి 17వ తేదీ వరకు వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు. మొత్తం 230 ఫ్లాట్లు ఉన్నాయని పేర్కొన్నారు.
గతంలో రాజీవ్ స్వగృహను ధరణి టౌన్‌షిప్‌గా మార్చిందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేలం వేయడం జరుగుతుందని వివరించారు. విలేకర్ల సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, నోడల్ అధికారి సత్యనారాయణ, తహసిల్దార్ ప్రేమ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.