ఆర్మూర్, ఫిబ్రవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్మూర్ పట్టు చేనేత ఖత్రీ కార్మికులను గుర్తించి వారికి బీజేపీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్ పట్టు శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
అంతరించి పోతున్న పట్టు చేనేతను ఆదుకోవాలని, శిథిలావస్థలో ఉన్న భవనాన్ని పునర్నిర్మించాలని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పట్టు చేనేత కార్మికులను ఆదుకొని నూతన మరమగ్గాలను ఇచ్చి పునః ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ డిమాండ్ చేస్తుందన్నారు. అలాగే కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పింఛన్ తక్షణమే ఇచ్చి వారిని ఆదుకోవాలని అన్నారు.
నూతన పట్టు చేనేత భవన నిర్మాణానికి సంబంధించిన ప్రొసీడిరగ్స్ వచ్చిన గాని స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పట్టు వస్త్ర కార్మికులపైన నిర్లక్ష ధోరణి కారణంగా భవన నిర్మాణం జరగడం లేదని ఖత్రీలపై ఉన్న ప్రేమ ఇదేనా అని, ఖత్రీలను నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదని వెంటనే నూతన పట్టు వస్త్ర భవనాన్ని నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి, బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, బిజెపి ఆర్మూరు పట్టణ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజు, బిజెపి సీనియర్ నాయకులు ద్యాగ ఉదయ్, బిజెపి ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు పాన్ శీను, ధోండి ప్రకాష్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు విజయానంద్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలు, షికారి శ్రీనివాస్, పుప్పాల పోశెట్టి, సడక్ మోహన్, జక్కం పోశెట్టి, కృష్ణ గౌడ్, శైలేష్ వెన్న మోహన్, భాషెట్టి దయాల్ తదితరులు పాల్గొన్నారు.