డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక, పరీక్ష ఫీజు గడువు పొడగింపు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్‌ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 16 వ తేదీ వరకు ఉండగా, విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నెల 18 వ తేదీ వరకు పొడగించినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ రివైస్డ్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు.

అంతేగాక 100 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 19 వ తేదీ వరకు, 500 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 21 వ తేదీ వరకు, 1000 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 22 వ తేదీ వరకు, 2000 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 23 వ తేదీ వరకు పరీక్షా ఫీజు చెల్లించవచ్చని ఆమె పేర్కొన్నారు.

ఈ నెల 19 నుంచి 25 వ తేదీ వరకు అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ పాఠ్యప్రణాళికలకు సంబంధించిన బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ ప్రాక్టికల్‌, ప్రాజేక్ట్‌, వైవా – వోస్‌ పరీక్షలు జరుగుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్‌ విడుదల చేశారు. కావున ఈ విషయాన్ని డిగ్రీ కళాశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు గమనించాలని కోరారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటి వెబ్‌ సైట్‌ ను సందర్శించాలని సూచించారు.

Check Also

చిత్తశుద్దితో విధులు నిర్వర్తించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »