Daily Archives: February 18, 2022

ఆలూర్‌లో కబడ్డీ పోటీలు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూర్‌ గ్రామంలో ఈ నెల 19, 20 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్‌ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్టు ఆలూర్‌ కబడ్డీ అసోసియేషన్‌ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో క్రీడాకారులు పాల్గొనాలని ఆహ్వానించారు. 19 వ తేది సాయంత్రం 4 గంటలకు ముఖ్య అతిథులచే క్రీడా పతాక ఆవిష్కరణ గావించి పోటీలను ప్రారంభిస్తామన్నారు. 20 వ తేదీ …

Read More »

దళిత బంధు కింద కామారెడ్డికి 350 యూనిట్లు

కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత బంధు పథకం కింద కామారెడ్డి జిల్లాకు 350 యూనిట్లు మంజూరైనట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాలులో శుక్రవారం జిల్లా స్థాయి అధికారులతో దళిత బంధు పథకం ద్వారా ఏర్పాటు చేసే యూనిట్ల పై చర్చించారు. దళిత సాధికారిత కోసం ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు. దళిత …

Read More »

క్రికెట్‌ టోర్నమెంట్‌లో టీయూ ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది విజయం

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత కొద్ది రోజులుగా మైదాన ప్రాంగణంలో టిఆర్‌ఎస్‌వి, విద్యార్థి జెఏసి, రీసర్చ్‌ స్కాలర్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో కేసీఆర్‌, బాజిరెడ్డి గోవర్ధన్‌ జన్మదిన వేడుకల సందర్భంగా క్రికెట్‌ టోర్నమెంట్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా శనివారం టీయూ ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది వర్సెస్‌ నిశిత డిగ్రీ కళాశాల జట్టుల మధ్య ఫైనల్‌ పోటీ జరిగింది. ఇందులో …

Read More »

వీసీని కలిసిన ఇడిఎస్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సిబ్బంది

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ను ఇడిఎస్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సిబ్బంది శుక్రవారం వీసీ చాంబర్‌ లో మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని దక్షిణ ప్రాంగణంలో గల జియో – ఇన్‌ ఫర్మాటిక్స్‌ విభాగానికి ఆర్క్‌జిఐఎస్‌ చెందిన సాఫ్ట్‌ వేర్‌ను సాంకేతికంగా అందిస్తామని వీసీకి ప్రతిపాదన చేశారు. సాఫ్ట్‌ వేర్‌ను జియో – …

Read More »

అభివృద్ధి పనులన్నీ గ్రౌండింగ్‌ చేయాల్సిందే

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయా పథకాలు, వివిధ కార్యక్రమాల కింద మంజూరైన అభివృద్ధి పనులన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రౌండిరగ్‌ చేయాల్సిందేనని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఏ ఒక్క పని కూడా పెండిరగ్‌ ఉండకూడదని, నిర్ణీత గడువు లోపు పనులను ప్రారంభించి షరవేగంగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. జాతీయ ఉపాధి హామీ పథకం, ప్రత్యేక అభివృద్ధి నిధులు, 15 ఆర్ధిక సంఘం …

Read More »

మన ఊరు – మన బడి అమలులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం అమలులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఎంతో కీలకమని, అప్పుడే ఈ కార్యక్రమం విజయవంతమై ఆశించిన ఫలితాలు సమకూరుతాయని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జెడ్పి సమావేశ మందిరంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావుతో కలిసి మన …

Read More »

మార్చి 14 నుండి ప్లాట్ల వేలం

కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం అడ్లూరు శివారులోని ధరణి టౌన్‌షిప్‌లోని 230 ప్లాట్లకు మార్చి 14 నుంచి 17 వరకు గెలాక్సీ ఫంక్షన్‌ హాల్‌లో ప్రత్యక్ష వేలం వేస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గెలాక్సీ ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం ధరణి టౌన్‌షిప్‌ ప్లాట్‌ల ఫ్రీ బిడ్‌ సమావేశం నిర్వహించారు. వేలంలో పాల్గొనేవారు పదివేల రూపాయలు కలెక్టర్‌ కామారెడ్డి …

Read More »

30న తెలంగాణ కామర్స్‌ అసోసియేషన్‌ వార్షిక సదస్సు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాతవహన విశ్వవిద్యాలయంలో మార్చి 30 వ తేదీన తెలంగాణ కామర్స్‌ అసోసియేషన్‌ మూడవ వార్షిక సదస్సు (టీసీఏ) జరుగనుందని తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్‌ విభాగాధిపతి, పాఠ్యప్రణాళికా సంఘ చైర్మన్‌ డా. జి. రాంబాబు తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని (బ్రోచర్‌) ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ కె. శివ శంకర్‌ వీసీ చాంబర్‌ లో శుక్రవారం ఆవిష్కరించారు. …

Read More »

మొదటి విడతలో 351 పాఠశాలలకు మౌళిక వసతులు కల్పిస్తాము

కామరెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వంద మంది విద్యార్థులకు పైగా ఉన్న పాఠశాలలను మొదటి విడతలో 351 పాఠశాలలకు మౌళిక వసతులను కల్పిస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారం మన ఊరు – మన బడి, మన బస్తి- మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ …

Read More »

23, 24 తేదీల్లో బాటనీ సదస్సు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాటనీ డిపార్ట్‌ మెంట్‌ ఈ నెల 23-24 తేదీల్లో ‘‘ప్రోటీన్స్‌, స్ట్రక్చర్‌, ఫంక్షన్‌ అండ్‌ ఎవల్యూషన్‌’’ అనే అంశంపై సైన్స్‌ అకాడమీస్‌’ విర్చువల్‌ లెక్చర్‌ వర్క్‌ షాప్‌ నిర్వహిస్తున్నట్లు వర్క్‌ షాప్‌ కో – ఆర్డినేటర్‌, బిఓఎస్‌ చైర్మన్‌ డా. అహ్మద్‌ అబ్దుల్‌ హలీం ఖాన్‌ తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని (బ్రోచర్‌) ఉపకులపతి ఆచార్య …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »