అభివృద్ధి పనులన్నీ గ్రౌండింగ్‌ చేయాల్సిందే

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయా పథకాలు, వివిధ కార్యక్రమాల కింద మంజూరైన అభివృద్ధి పనులన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రౌండిరగ్‌ చేయాల్సిందేనని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఏ ఒక్క పని కూడా పెండిరగ్‌ ఉండకూడదని, నిర్ణీత గడువు లోపు పనులను ప్రారంభించి షరవేగంగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు.

జాతీయ ఉపాధి హామీ పథకం, ప్రత్యేక అభివృద్ధి నిధులు, 15 ఆర్ధిక సంఘం నిధులు, ఎంపీ ల్యాడ్స్‌, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల కింద జిల్లాలోని ఆయా మండలాలకు, మున్సిపాలిటీలకు మంజూరు చేసిన పనుల ప్రగతిపై శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఒక్కో మండలం వారీగా మంజూరైన పనులు, ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయి, ఎన్ని పనులు ఇంకనూ పెండిరగ్‌ లో ఉన్నాయన్న వివరాలను ఆరా తీస్తూ పనుల పూర్తి కోసం అధికారులకు స్పష్టమైన గడువులు విధించారు.

ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులన్నీ ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. మిగతా పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన జరిపిస్తూ, ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసే లోపు పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు. లేని పక్షంలో బిల్లుల మంజూరులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందన్నారు. పలు చోట్ల పనులను ఇంకనూ ప్రారంభం చేయలేదని, చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకుంటూ ప్రతీ పని గ్రౌండిరగ్‌ అయ్యేలా అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు.

పనుల ప్రారంభానికి అడ్డంకులు తీవ్ర స్థాయిలో ఉంటే తమ దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. వివిధ కారణాలను సాకుగా చూపుతూ అభివృద్ధి పనులను చేపట్టకుండా అలసత్వం వహిస్తే ఉపేక్షించబోమని కలెక్టర్‌ తేల్చి చెప్పారు. కమ్యూనిటీ హాళ్లు, బీటీ రోడ్లు వంటి నిర్మాణ పనులకు కూలీల కొరత, యంత్ర సామాగ్రి కొరత ఉంటే ఇతర జిల్లాల నుండి తెప్పించుకోవాలని సూచించారు. అవసరమైతే పొరుగున ఉన్న మహారాష్ట్ర నుండి కూడా వాటిని సమకూర్చుకుని నిర్దేశిత గడువులోపు పనులను పూర్తి చేయాలన్నారు.

తాను రెండుమూడు రోజుల్లో మండలాల వారీగా పర్యటిస్తూ అభివృద్ధి పనులను పరిశీలిస్తానని, ఆలోపు ప్రగతి పనులన్నీ ప్రారంభమై వేగవంతంగా కొనసాగుతూ కనిపించాలన్నారు. పనుల ప్రారంభానికి అడ్డంకులు తీవ్ర స్థాయిలో ఉంటే తమ దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, జెడ్పి సిఈఓ గోవింద్‌, డీఆర్‌డీఓ చందర్‌, ఆర్‌ డీ వోలు రవి, రాజేశ్వర్‌, శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్లు, ఆయా శాఖల ఇంజినీరింగ్‌ అధికారులు, వివిధ మండలాల అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »