డిచ్‌పల్లి, ఫిబ్రవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాటనీ డిపార్ట్ మెంట్ ఈ నెల 23-24 తేదీల్లో ‘‘ప్రోటీన్స్, స్ట్రక్చర్, ఫంక్షన్ అండ్ ఎవల్యూషన్’’ అనే అంశంపై సైన్స్ అకాడమీస్’ విర్చువల్ లెక్చర్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు వర్క్ షాప్ కో – ఆర్డినేటర్, బిఓఎస్ చైర్మన్ డా. అహ్మద్ అబ్దుల్ హలీం ఖాన్ తెలిపారు.
దీనికి సంబంధించిన కరపత్రాన్ని (బ్రోచర్) ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్ సదస్సు ఇండియన్ అకాడమి ఆఫ్ సైన్స్ బెంగుళూర్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమి న్యూడిల్లీ, ద నేషనల్ అకాడమి ఆఫ్ సైన్స్ ఇండియా అలహాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో సైన్స్ సదస్సు జరగడం సంతోషాన్ని కలిగిస్తుందన్నారు.
బ్రోచర్ ఆవిష్కరణలో వీసీతో పాటు సైన్స్ ఫ్యాకల్టీ డీన్ ఆచార్య ఎం. అరుణ, బిఒఎస్ డా. హలీం ఖాన్, అధ్యాపకులు డా. శ్రీనివాస్, డా. జలందర్ పాల్గొన్నారు.