నిజామాబాద్, ఫిబ్రవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర – నిజామాబాద్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా స్థాయి యూత్ టోర్నమెంట్ ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, మహిళల, పురుషులకు క్రీడా పోటీలు ఈనెల 23న వన్డే టోర్నమెంట్ జిల్లా క్రీడా మైదానంలో (కలెక్టర్ గ్రౌండ్) నిర్వహించనున్నట్టు జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
23వ తేదీ ఉదయం 9 గంటలకి రాష్ట్ర మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యే పోటీలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయన్నారు. పోటీల్లో పాల్గొనే అందరికీ కేంద్ర ప్రభుత్వ యువజన, క్రీడా మంత్రిత్వశాఖ ద్వారా ప్రశంసా పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు.
పాల్గొనే వారికి సూచనలు
- ఒక క్రీడాంశంలో పాల్గొనే క్రీడాకారులు వేరే క్రీడల్లో పాల్గొన్నరాదు.
- క్రీడాకారులకు భోజన వసతి కలదు.
- క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 23వ తేదీ బుధవారం రోజున ఉదయం 9 గంటలకు రిపోర్ట్ చేయాలి.
- టోర్నమెంట్ నందు పాల్గొనే టీమ్స్ 21 వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు తమ ఎంట్రీలు ఇవ్వగలరు, తరువాత ఎంట్రీస్ స్వీకరించబడవు.
ఇతర వివరాలకు సంప్రదించాల్సి ఫోన్ నంబర్ 917661919365.