డిచ్‌పల్లి, ఫిబ్రవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ను ఇడిఎస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బంది శుక్రవారం వీసీ చాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిశారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని దక్షిణ ప్రాంగణంలో గల జియో – ఇన్ ఫర్మాటిక్స్ విభాగానికి ఆర్క్‌జిఐఎస్ చెందిన సాఫ్ట్ వేర్‌ను సాంకేతికంగా అందిస్తామని వీసీకి ప్రతిపాదన చేశారు. సాఫ్ట్ వేర్‌ను జియో – ఇన్ ఫర్మాటిక్స్ తో పాటు ఎకనామిక్స్, ఈ కామర్స్, ఎంబిఎ, కంప్యూటర్ సైన్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ తదితర విభాగాలకు సద్వినియోగ పరుచుకోవచ్చాన్నారు. తమ సంస్థ దాదాపు 26 సంవత్సరాల అనుభవం కలిగిందని తెలిపారు.
బెంగుళూర్ లో ప్రధాన కేంద్రం ఉండగా దేశం మొత్తం మీద 7 కేంద్రాలతో వ్యాప్తి చెందిందని అన్నారు. డసార్ట్, ఇస్రీ వంటి ప్రముఖ సాంకేతిక సంస్థలతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ విద్యార్థులకు త్రీడి మ్యాపింగ్, ప్లేస్ మెంట్స్, వర్క్ షాప్స్, ప్రాజెక్ట్స్, సెమినార్స్, ఫ్యాకల్టీ ట్రైనింగ్ ప్రోగ్రాముల్లో తర్ఫీదు అందిస్తున్నట్లు వెల్లడిరచారు. తమ సాఫ్ట్ వేర్‌తో జిఐఎస్ మ్యాపింగ్, త్రిడి మ్యాపింగ్, లొకేషన్ ఇంటలిజెన్స్, స్పెషల్ ఎనలిటిక్ సెల్యూషన్స్ వంటి ప్రోగ్రాంస్ రూపొందించవచ్చన్నారు.
సుదీర్ఘ చరిత్ర కలిగి చక్కని ఫలితాలందిస్తున్న ఇడిఎస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సేవలను తప్పకుండా వినియోగించుకుంటామని వీసీ హామీ ఇచ్చారు. వీసీని కలిసిన వారిలో సీనియర్ మేనేజర్ టెక్నికల్ వినయ్ బాబు, టెక్నికల్ మేనేజర్ లక్ష్మీనారాయణ, బిజినెస్ డెవెలప్ మెంట్ మేనేజర్ వెంకటేష్, దక్షిణ ప్రాంగణం జియో – ఇన్ ఫర్మాటిక్స్ విభాగాధిపతి డా. ఆర్ సుధాకర్ గౌడ్, బిఒఎస్ డా. ప్రతిజ్ఞ, అధ్యాపకులు డా. ఎస్. నారయణ ఉన్నారు.