కామారెడ్డి, ఫిబ్రవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహం ( ఆనంద నిలయం) ను శనివారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు, స్వీట్లు పంపిణీ చేశారు.
విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు పొందాలని కోరారు. విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఆయన వెంట జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారిణి రజిత, అధికారులు ఉన్నారు.