నిజామాబాద్, ఫిబ్రవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి దరఖాస్తులు ఏ ఒక్కటి కూడా పెండిరగ్ ఉంచకుండా వెంటవెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో రెవెన్యూ అధికారులతో ధరణి కార్యక్రమంపై సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా ఆయా మండలాల వారీగా పెండిరగు ధరణి దరఖాస్తుల గురించి కలెక్టర్ ప్రస్తావిస్తూ, పెండిరగు ఉండడానికి గల కారణాలు ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లో ధరణి పెండిరగ్ దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. పెండిరగ్ దరఖాస్తులు పెరిగిపోతే అనవసరంగా లేనిపోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకొని వచ్చే బుధవారం వరకు ఏ ఒక్క దరఖాస్తు కూడా పెండిరగ్ లేకుండా అన్నింటినీ పరిష్కరించాలని ఆదేశించారు. అయితే నిబంధనలను తూ. చ తప్పకుండా పాటించాలని, తన ఆమోదం కోసం పంపించే దరఖాస్తులను సమగ్ర సమాచారంతో పంపించాలన్నారు. పహాణీలు, టైటిల్ డీడ్, ఈ.సి తదితర వాటితో పాటు క్షేత్రస్ధాయి పరిశీలన జరిపితే చాలా వరకు పెండిరగ్ దరఖాస్తులు పరిష్కరించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న చిన్న కారణాలతో దరఖాస్తులు పెండిరగులో ఉంచకూడదని, బుధవారం మలి విడత నిర్వహించే సమావేశం నాటికి పెండిరగ్ దరఖాస్తులన్నీ పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో నిజామాబాద్ ఆర్డీవో రవి, ఆయా మండలాల తహసీల్దార్‌లు, కలెక్టరేట్ రెవెన్యూ విభాగాల అధికారులు పాల్గొన్నారు.