ఆర్మూర్, ఫిబ్రవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం దేగాం గ్రామంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్బంగా ఆర్మూర్ మండల టిఆర్‌ఎస్ నాయకులు, దేగాం గ్రామ నాయకులు, పలు యువజన సంఘాల సభ్యులు పూల మాలలు వేసి నివాళులు అర్పించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఛత్రపతి శివాజీని గుర్తు చేసుకొని మొఘల్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచి ప్రత్యేక మరాఠా రాజ్యాన్ని నిర్మించిన గొప్ప భవాని మాతా భక్తుడు శివాజీ మహరాజ్ అని అన్నారు. అన్ని మతాలను సమానంగా స్వీకరించిన ఆయన రాజ్యంలో దేవుని ఆలయాలు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులు కట్టించాడని, శివాజీ సైన్యంలో మూడొంతులు ముస్లిములు ఉండేవారని, ఆయన రాజ్యంలో ఎందరో ముస్లిములు ఉన్నత పదవులు నిర్వహించారని చెప్పారు.
అందులో ముఖ్యంగా హైదర్ ఆలీ ఆయుధాల విభాగానికి, ఇబ్రహీం ఖాన్ నావికాదళానికి, సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారని, శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులు దౌలత్ ఖాన్, సిద్ధిక్ అనే ఇద్దరు కూడా ముస్లిం సోదరులే అని గుర్తు చేశారు. శివాజీ అంగ రక్షకులలో అతిముఖ్యుడూ, ఆగ్రా నుంచి శివాజీ మహరాజ్ తప్పించుకోటానికి సహకరించిన వ్యక్తి మదానీ మెహ్తర్ కూడా ముస్లిమే అన్నారు. శివాజీ మహరాజ్ గారి స్పూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ అభివృద్ధిలో తెలంగాణను ముందు వరుసలో నిలిపారని గుర్తు చేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆలూర్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ లింగారెడ్డి, దేగం ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ గంగారెడ్డి,నాయకులు ముత్యం రెడ్డి, పడిగెల రాజు, ఆరే రాజేశ్వర్, ప్రభాకర్, ఆర్. శ్రీనివాస్ గౌడ్, పలు యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.