కామారెడ్డి, ఫిబ్రవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల్లోని ప్రభుత్వ భూములను సంరక్షించాల్సిన బాధ్యత తహశీల్దార్లపై ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం తహసిల్దార్‌లతో ప్రభుత్వ భూముల సంరక్షణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
గ్రామాల్లో ప్రభుత్వ భూములను సర్వే చేయించాలని సూచించారు. రక్షణగా హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ భూముల్లో ఎవరైనా నిర్మాణాలు చేపడితే వాటిని ఆపివేసి నోటీసులు ఇవ్వాలని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల వారీగా ప్రభుత్వ భూముల వివరాలు సేకరించాలని చెప్పారు.
రెవెన్యూ, అటవీ భూముల వివాదాలు ఉంటే సంయుక్త సర్వే చేపట్టాలని కోరారు. సమీక్ష సమావేశంలో ఆర్‌డిఓలు రాజా గౌడ్, శీను నాయక్, కలెక్టరేట్ ఏవో రవీందర్, తహసీల్దార్లు పాల్గొన్నారు.