డిచ్పల్లి, ఫిబ్రవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 21 వ తేదీ వరకు ఉండగా, బ్యాక్ లాగ్ విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నెల 22 వ తేదీ వరకు పొడిగించినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ సోమవారం మధ్యాహ్నం రివైస్డ్ షెడ్యూల్ విడుదల చేశారు.
అంతేగాక 100 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 23 వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. కావున ఈ విషయాన్ని డిగ్రీ కళాశాలల ప్రధానాచార్యులు, బ్యాక్ లాగ్ విద్యార్థులు గమనించాలని కోరారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటి వెబ్ సైట్ను సందర్శించాలని సూచించారు.