కామారెడ్డి, ఫిబ్రవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సోమవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం, భీమ, ఉచిత విద్యుత్ ను అందిస్తూ రైతులకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రమోహన్, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, వైస్ చైర్ పర్సన్ హిందూ ప్రియా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్, జిల్లా తెరాస అధ్యక్షుడు ముజిబోద్ధిన్, ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.