కామారెడ్డి, ఫిబ్రవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్స్ పోలియో వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించడానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం పల్స్ పోలియో పై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. అంగన్‌వాడి, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు గ్రామాలలో సర్వే చేపట్టి 0-5 లోపు పిల్లల వివరాలను సేకరించాలని సూచించారు.
ఐసిడిఎస్, పంచాయతీ, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈనెల 27న జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఫిబ్రవరి 28, మార్చి 1న పల్స్ పోలియో కార్యక్రమాన్ని సిబ్బంది ఇంటింటికి తిరిగి 100% విజయవంతం అయ్యే విధంగా చూడాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పల్స్ పోలియో విజయవంతం చేస్తామని అధికారులు ప్రతిజ్ఞ చేశారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్, డిఆర్‌డిఓ వెంకట మాధవరావు, ఇంచార్జ్ జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ అజయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.