డిచ్‌పల్లి, ఫిబ్రవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ప్రధాన ప్రాంగణంలోని విశ్వవిద్యాలయ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ సోమవారం ఉదయం ఆకస్మికంగా పర్యవేక్షించారు.
తెలుగు, ఆంగ్లం, ఉర్దు, హిందీ, కెమిస్ట్రీ విభాగాలను సందర్శించి విద్యార్థులతో, అధ్యాపకులతో మాట్లాడారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థుల స్వస్థలాలను, వారికి అభిరుచి గల అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా విభాగాల్లో గల పాఠ్యప్రణాళికల్లో గల ప్రత్యేకాంశాలను గూర్చి తెలుసుకొని ప్రశంసించారు. కోవిద్ – 19 కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైన సందర్భంగా సెలబస్ త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
విద్యార్థులందరు సక్రమంగా తరగతులకు హాజరయ్యేటట్లు ప్రత్యేక శ్రద్ధ వహించే విధంగా బోధన జరపాలని అన్నారు. హాస్టల్‌లో ఉన్న విద్యార్థులు ఖచ్చితంగా తరగతులకు హాజరు కావాలని కోరారు.