Daily Archives: February 22, 2022

అభివృద్ధికి పాటుపడుతున్న ప్రభుత్వానికి అండగా నిలువండి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో నే మరెక్కడా లేని విధంగా తెలంగాణలో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న తమ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి కోరారు. మంగళవారం వేల్పూరు మండల కేంద్రంలో, పడిగెల్‌ గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాలను మంత్రి ఆవిష్కరించారు. అదేవిధంగా పెద్దవాగుపై …

Read More »

రక్తదానం పట్ల అపోహలు విడనాడాలి..

కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలలో ఆపరేషన్ల నిమిత్తమై కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మీ మరియు ఖైరున్నిస్సా బేగంలకు కావలసిన ఏబి పాజిటివ్‌ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో కామారెడ్డి జిల్లా జూనియర్‌ రెడ్‌ క్రాస్‌ సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహం నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా పట్టణానికి చెందిన హష్మీ మరియు మల్కాపూర్‌ గ్రామానికి చెందిన …

Read More »

పంట రుణాల పంపిణీలో అలసత్వం తగదు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్నందున సేద్యపు రంగానికి విరివిగా రుణాలు పంపిణీ చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి బ్యాంకర్లకు సూచించారు. పంట రుణాల పంపిణీలో ఎంతమాత్రం అలసత్వానికి తావివ్వకూడదని అన్నారు. స్థానిక ప్రగతి భవన్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఆయా …

Read More »

జాబ్‌మేళాలు సద్వినియోగం చేసుకోవాలి…

కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్రం, ఉపాధి శిక్షణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన జాబ్‌ మేళా కు విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి 350 మంది యువతీయువకులు జాబ్‌ మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ ద్వారా ఎస్‌బిఐ, శుభగృహ, విజయ బోయో ఫర్టిలైజర్‌, టాటా మోటార్స్‌తో పాటు 6 ఇతర కంపెనీలు …

Read More »

జిల్లా స్థాయి యూత్‌ పార్లమెంట్‌ విజేతల ప్రకటన

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్‌ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించబడిన జిల్లా స్థాయి యూత్‌ పార్లమెంట్‌ పోటీల విజేతలను ప్రకటించారు. నిజామాబాద్‌ జిల్లాకు మొదటి స్థానంలో అక్షిత, రెండవ స్థానం శ్రీజ జాదవ్‌, కామారెడ్డి జిల్లా మొదటి స్థానం మౌనిక, రెండవ స్థానం అనిల్‌ రాథోడ్‌ గెలుపొందారు. వీరు త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు, అక్కడ …

Read More »

నైపుణ్య కేంద్రాలను యువత సద్వినియోగం చేసుకోవాలి…

కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి మెరుగైన ఉపాధి కల్పించేందుకు ఆయా శాఖలలో కలిగి ఉన్న అవకాశాలను వెలికితీయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా స్థాయి నైపుణ్యం కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో ఉచిత నైపుణ్య శిక్షణ, …

Read More »

ప్రారంభమైన బి.ఎడ్‌., ఎం.ఎడ్‌. పరీక్షలు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్‌., ఎం.ఎడ్‌. కోర్సులకు చెందిన రెండవ సెమిస్టర్‌ థియరీ రెగ్యూలర్‌ పరీక్షలు మంగళవారం ప్రారంభమైనట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. బి.ఎడ్‌. రెండవ సెమిస్టర్‌ థియరీ రెగ్యూలర్‌ పరీక్షలకు మొత్తం 322 మంది నమోదు చేసుకోగా 307 హాజరు, 15 గైర్హాజరు అయ్యారని, ఎం.ఎడ్‌. రెండవ సెమిస్టర్‌ …

Read More »

28 నుండి డిగ్రీ ఎగ్జామ్స్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు ఈ నెల 28 వ తేదీ నుంచి జరుగనున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటలో తెలిపారు. కావున ఈ విషయాన్ని డిగ్రీ కళాశాలల ప్రధానాచార్యులు, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »