కామారెడ్డి, ఫిబ్రవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్రం, ఉపాధి శిక్షణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన జాబ్ మేళా కు విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి 350 మంది యువతీయువకులు జాబ్ మేళాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇంటర్వ్యూ ద్వారా ఎస్బిఐ, శుభగృహ, విజయ బోయో ఫర్టిలైజర్, టాటా మోటార్స్‌తో పాటు 6 ఇతర కంపెనీలు 300 మందిని ఉద్యోగాల కోసం ఎంపిక చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఉపాధి శిక్షణ అధికారిని శబ్న మాట్లాడారు.
ప్రతి నెలా తాము నిర్వహించే జాబ్ మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడారు. నెహ్రూ యువ కేంద్ర యువత యొక్క నైపుణ్యాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంటర్వ్యూలో ఎంపిక చేయబడ్డ వారికి నియామక పత్రాలను అధికారులు అందించారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.