కామారెడ్డి, ఫిబ్రవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలలో ఆపరేషన్ల నిమిత్తమై కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మీ మరియు ఖైరున్నిస్సా బేగంలకు కావలసిన ఏబి పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో కామారెడ్డి జిల్లా జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహం నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా పట్టణానికి చెందిన హష్మీ మరియు మల్కాపూర్ గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి లకు తెలియజేయగానే వారు వెంటనే స్పందించి సకాలంలో రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు.
రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాడాలని 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు కలిగిన యువతీ యువకులు సంవత్సరానికి 4 సార్లు రక్తదానం చేయవచ్చునని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి సకాలంలో రక్తం అందించడానికి సిద్ధంగా ఉంటామని, ఎవరికైనా రక్తం అవసరం ఉన్నట్లయితే 9492874006 కి సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో వి.టి. ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్, రాజు, సందీప్ పాల్గొన్నారు.